మూడు భాషల్లో రిలీజ్ అవుతున్న తెలుగు “లవ్ స్టోరీ”..

Join Our Community
follow manalokam on social media

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి తాజా అప్డేట్ వచ్చింది. ఇప్పటికే రిలీజైన పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా లవ్ స్టోరీ చిత్రం తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోనూ రిలీజ్ అవనుందట. కన్నడ, మళయాలంలోనూ తెలుగుతో సహా రిలీజ్ అవనుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సాయి పల్లవి మళయాలం సినిమాతోనే ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. ఇప్పుడు తెలుగు సినిమా మళయాలంలో రిలీజ్ అవడం నిర్మాతలకి కలిసొచ్చే అంశమే. ఇటు కన్నడలో రిలీజ్ అవడం మంచి పరిణామమే. మరి తమిళంలో ఎందుకు వద్దనుకున్నారో! మొత్తానికి సినిమా మీద అంచనాలు బాగా పెరిగిన ప్రస్తుత సమయంలో మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవడం లవ్ స్టోరీ సినిమాకి ఎలా కలిసొస్తుందో చూడాలి.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...