వాలెంటైన్స్ డే రోజు చాలా మంది ప్రేమికులు నిరుత్సాహ పడ్డారు అని అంటున్నాయి సర్వేలు. ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రేమికులు పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు. పార్కు, బీచ్, లాంటి పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న ప్రేమికులకు భజరంగ్ దళ్, ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు ప్రేమికుల ఏకాంతానికి భంగం కలిగించారు. తమకు అనువుగా, ప్రైవసీకి అడ్డు తగలవని హోటళ్లను ఆశ్రయిస్తే, అక్కడ హోటల్ సిబ్బంది అడిగిన సవాలక్ష ప్రశ్నలకు, హోటల్ సిబ్బంది అనుమానంగా చూడడం తో విసుగెత్తిన ప్రేమికుల కష్టానికి అంతేలేకుండా పోయింది.
ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే సిబ్బంది ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతున్నారు. ప్రేమ జంటలకు ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే, తమకు అనువుగా నేటి యువతరం ‘కపుల్ ఫ్రెండ్లీ’ హోటళ్లను కావాలనుకుంటున్నారు. ఈ మేరకు చేసిన సర్వే లో ఒక రోజు లోపు స్టే కోసం ఆ హోటళ్లకే 72 శాతం మంది ఒకే చెప్పగా, ప్రశ్నలు వేయని హోటళ్లకు 80% మంది మొగ్గు చూపారు. ఈ విషయాన్ని ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ కంపెనీ గోఐబిబో చేసిన సర్వేలో వెల్లడైంది.
46% హోటల్ బుకింగ్‌లు లోకల్‌గా ఉండే యువత నుంచే వస్తున్నట్టు సర్వే తేల్చింది. మిగతా 54% వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారివి అని ఈ సర్వే పేర్కొంది. దాదాపు 50% మంది ఐదు సార్లు కంటే ఎక్కువ కపుల్ ఫ్రెండ్లీ హోటళ్లను బుక్ చేసినట్టు చెప్పారు. అందులో 33 శాతం మంది చెకిన్ అయిన రోజే చెకౌట్ అయ్యారు. తక్కువ ధరలు ఉండే హోటళ్లకు 61%, లొకేషన్‌ను బట్టి 55%, రేటింగ్‌ను బట్టి 53%, ప్రైవసీకి తగ్గట్టు 52% మంది, డిస్కౌంట్లు ఎక్కువిచ్చే హోటళ్లు కావాలని 38% మంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఇలా నానా కష్టాలు పడి ఎలాగో సర్దుకున్నారు అన్నమాట ప్రేమ పక్షులు.