జేడీ లక్ష్మీ నారాయణ వేసిన కొత్త బాంబ్ తో ఏపీ లో సరికొత్త రచ్చ షురూ ?

-

వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ క్విడ్ ప్రో కేసులను సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయం లక్ష్మీనారాయణ విచారించడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రకు బదిలీ అయి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రావాలని తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా ప్రతి గ్రామంలో ఉన్న రైతులతో సమావేశాలు అయినా లక్ష్మీనారాయణ అందరూ కొత్త పార్టీ పెడతారా అని అనుకున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరతారని మరియు టిడిపిలో చేరుతారనే రకరకాల వార్తలు వచ్చాయి.

తీరా చివరాకరికి జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖపట్టణం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తర్వాత మెల్ల మెల్లగా పార్టీకి దూరమవుతూ ఇటీవల ఒక్కసారిగా రాజీనామా చేశారు. తన రాజీనామా కి కారణం పవన్ కళ్యాణ్ నిలకడలేని నాయకుడు అంటూ మాటమీద నిలబడే మనిషి కాదని జేడీ లక్ష్మీనారాయణ వివరణ ఇచ్చారు. ఇటువంటి తరుణంలో తాజాగా జేడీ లక్ష్మీనారాయణ వేసిన కొత్త రాజకీయ ఎత్తుగడ ఏపీ రాజకీయాల్లో సరికొత్త బాంబు పేల్చింది.

 

మేటర్ లోకి వెళితే ఇటీవల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై భారీ స్థాయిలో గెలవడం జరిగింది. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఇటువంటి నేపథ్యంలో పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరింపచేయడానికి రెడీ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమాలు జేడీ లక్ష్మీనారాయణ చేతిలో పెట్టడానికి కేజ్రీవాల్ రెడీ అయినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో నిజంగా జేడీ లక్ష్మీనారాయణ చేరిన ఆయన ఆధ్వర్యంలో పార్టీ నడిచిన ఏపీ రాజకీయం లో ఇది ఒక సరికొత్త ఎత్తుగడ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news