బిగ్‌ షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. నేటి నుంచి అమలు

బీజేపీ సర్కార్‌… కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలకు వరుసగా షాక్‌ లు తగులుతూనే ఉన్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ నుంచి పెట్రోల్‌, డిజీల్‌ వరకు అన్నిటి ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. చమురు ధరలైతే… సెంచరీ కొట్టి… 150 దిశగా పెరిగుతున్నాయి. ఇక అటు… గ్యాస్‌, వంట నూనెల ధరలు మండిపోతున్నాయి.

gas
gas

గ్యాస్‌ సిలిండర్‌ ధర అయితే.. వెయ్యికి చేరువలో ఉంది. అయితే.. తాజాగా మరోసారి కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచేశారు. పెరిగిన ఈ ధరలను నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు ఆయిల్‌ కంపెనీలు తెలిపాయి. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.103.50 కు పెరిగింది. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఆయిల్‌ కంపెనీలు సమీక్షించుకుంటాయి. తాజా సమీక్ష లో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కాగా.. గౄహ అవసరాలకు వినియోగించే 14,2 కేజీల సిలిండర్‌ ధరను మాత్రం పెంచలేదు ఆయిల్‌ కంపెనీలు. దీంతో సామాన్యులకు భారీ ఊరట లభించింది.