జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ఇద్దరు తీవ్రవాదుల హతం.

-

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భద్రతా బలగాలు పై చేయి సాధించాయి. తాజాగా జరిగిన పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని కస్‌బయార్ ప్రాంతంలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులకు అందిన సమాచారంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు..దీని ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరోవైపు ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదులను నిషేధిత జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఎన్ కౌంటర్ లో ఉగ్రవాద కమాండర్ యాసిర్ పర్రెతో సహా మరో పాకిస్థాన్ ఉగ్రవాది ఫుర్కాన్ హతమయ్యారు.

ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్ఫీఎఫ్ బలగాలు ఉమ్మడిగా సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.  వారం రోజుల క్రితం కూడా ఎన్ కౌంటర్ జరిగింది. దీంట్లో లష్కర్ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫోర్స్ కు సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news