బ్యాడ్ న్యూస్… రాత్రికిరాత్రే ఈ మూడింటి ధరల పెంపు..!

కేంద్రం సామాన్యులకి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు ఏకంగా ఈ మూడింటి ధరల్ని పెంచేసింది. దీనితో సామాన్యులకి ఇక్కట్లు తప్పేలా లేవు. ఒకే రోజు పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇప్పటికే ఎంతగానో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఇది మళ్ళీ పెద్ద ఇబ్బందినీ తీసుకొచ్చింది.

ధరల పెంపు నిర్ణయంతో మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైకి కదలడం వల్లనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. క్రూడ్ రేట్లు కదలికలు నేరుగానే ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలను ఎఫెక్ట్ చేస్తాయి. అలానే అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చేస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈరోజు 2 శాతానికి పైగా పెరిగాయి. 118 డాలర్ల పైన కదలాడుతున్నాయి. దీనితో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచాయి. పెట్రోల్ ధర గురించి చూస్తే.. హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ ధర 80 పైసలు పెరిగింది. దీనితో రూ. 109కు చేరింది. ఇది ఇలా ఉంటే డీజిల్ ధర లీటరుకు 80 పైసలు పైకి చేరింది.

దీంతో దీని రేటు రూ. 95.42కు ఎగసింది. ఇక గ్యాస్ సిలిండర్ గురించి చూస్తే.. గ్యాస్ సిలిండర్ ధరను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరకు ఇలా పెంచారు.

మార్చి 22 నుంచే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి రావడం జరిగింది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,002కు చేరింది. అలానే డెలివరీ చార్జీలు రూ.30 కలుపుకుంటే ధర రూ.1032 అయ్యింది. అలాగే ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు చేరింది. చార్జీలు కలుపుకుంటే సిలిండర్ పొందాలంటే రూ.1040 చెల్లించాల్సి ఉంటుంది.