బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర నిలిపివేయాలన్న పోలీసుల నోటీసులపై హైకోర్టుల లంచ్​మోషన్ పిటిషన్ దాఖలైంది. మధ్యాహ్నం 3.45 గంటలకు అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. తన పాదయాత్ర ఆగిన చోటే మళ్లీ మొదలుపెడతానని బండి సంజయ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న విషయం అందరిలో ఆసక్తి రేపుతోంది.

జనగామ జిల్లాలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్ర కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. యాత్ర నిలిపివేయాలని నోటీసులిచ్చిన క్రమంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓవైపు ఆగిన చోటే తన యాత్ర మొదలుపెడతానని బండి సంజయ్.. మరోవైపు పాదయాత్ర కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న క్రమంలో కోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు అక్రమ అరెస్టులు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కరీంనగర్​లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news