బ్రేకింగ్: మా కీలక నిర్ణయం, రాజశేఖర్‌కు షాక్…!

మా ఉపాధ్యక్ష పదవికి హీరో రాజశేఖర్ చేసిన రాజీనామాను అధ్యక్షుడు నరేష్ ఆమోదించారు. ఈ మేరకు లేఖను విడుదల చేసారు. ఇటీవల డైరీ ఆవిష్కరణ సమయంలో మాలో ఉన్న విభేదాలను మా పెద్దల ముందే రాజశేఖర్ బయటపెట్టారు. ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజివి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

తమ మాటను రాజశేఖర్ గౌరవించడం లేదంటూ అసహనం వ్యక్తం చేసారు. ఇక ఆ తర్వాత సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతున్న సమయంలో మోహన్ బాబు మైక్ లాక్కోవడం, అసహనం వ్యక్తం చేసి సమావేసం నుంచి వెళ్ళిపోవడం సంచలనంగా మారాయి. ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్న చిరంజీవి మోహన్ బాబు వేదిక మీద కౌగలించుకోవడంతో ఒక్కసారిగా వాతవరణం మారిపోయింది.

ఆ తర్వాత జీవిత మాట్లాడుతూ తన భర్త రాజశేఖర్ ది చిన్న పిల్లల మనస్తత్వం అని మనసులో ఏం దాచుకోలేరని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఇక చిరంజీవి మా అసోసియేషన్ రాజశేఖర్ పై క్రమశిక్షణ కమిటీ తీసుకోవాలని కోరారు. అదే రోజు సాయంత్రం రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేసారు. ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదించడంతో వివాదం దాదాపుగా ముగిసినట్టే అంటున్నారు.