MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) ఎన్నికలు ముగిసిన.. మా వివాదం లో వేడీ మాత్రం తగ్గడం లేదు. శనివారం అధికారికంగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసి.. మా అధ్యక్ష పీఠం అధిష్టించారు. అయినా ప్రకాశ్ రాజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాష్ రాజ్. మా ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ కావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు.
సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని, సీసీ ఫుటేజ్ భద్రంగా ఉందని అన్నారు.
కానీ, ఆయన డిమాండ్ ను నిరాకరించారు. ఓవైపు డైలాగ్ వార్ జరుగుతూనే.. మరో వైపు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీనితో ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మా ఎలక్షన్ జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లోని సర్వర్‌రూమ్‌కు లాక్ చేశారు.
అసలు ఈ సీసీ పుటేజ్‌లో ఏముంది ? ప్రకాశ్ రాజ్ ఫుటేజ్ ఎందుకు అడుగుతున్నారు? మరీ కుదరదని ఎలక్షన్ ఆఫీసర్ ఎందుకు చెబుతున్నారు? ఇస్తే ఏం జరుగుతుంది? ఇవ్వకపోతే ఏ అంశాలు మరుగున పడుతాయి? ఇష్యూలోకి పోలీసుల ఎంట్రీ దేనికి? మరి నెక్ట్స్ ఏంటి? అవే అంశాలపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.ఎన్నికలు జరిగిన తరువాత మా లో తగ్గని ఈ వేడి ఇంకా ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.