ఆహాలో “లవ్ స్టోరి”.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

-

అక్కినేని నాగ చైతన్య మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా కు టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల కాకముందే… అనేక రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన లవ్ స్టోరీ మూవీ… గత నెల అంటే సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది.

విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు.. ప్రేక్షకుల్లో లవ్ స్టోరీ పై ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి రికార్డు బ్రేకింగ్ మూవీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది లవ్ స్టోరీ. ఈ సినిమాపై విమర్శకుల తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా కురిసాయి.

థియేటర్లలో విశేషంగా ఆకట్టుకున్న లవ్ స్టోరీ సినిమా ఇక ఓటీటీ లోను రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంది. లవ్ స్టోరీ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 22 వ తేదీ నుంచి ఆ హాల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా ఈ సినిమాను చూడనివారు… ఇక ఆహా లో మళ్లీ మళ్లీ చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news