మా ఎన్నికల్లో బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానెల్

-

మూవీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ బోణీ కొట్టింది. క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠతతో కౌంటింగ్ జరగుతోంది. మొదటగా పోస్టల్ ఓట్లలో మంచు విష్ణు ప్యానెల్ కు అధిక ఓట్లు వచ్చాయి. అయితే తొలి విజయం మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నమోదు చేసింది. ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపులో తొలి విజయం నమోదైంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన శివారెడ్డి, మంచు విష్ణు ప్యానెల్ అభ్యర్థి సంపూర్ణేష్ బాబు పై గెలుపోందారు. మరోవైపు నిర్మాత సురేష్ కొండేటి కూడ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందారు.maa elections వీరితో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచే యాంకర్ అనసూయ, కౌషిక్ కూడా గెలుపొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈసీ మెంబర్లలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 08 మంది, మంచువిష్ణు ప్యానెల్ నుంచి 10 మంది లీడ్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version