ఆ విషయంలో..అఖిల్, సమంతతో నితిన్ ఫైట్..!

-

యూత్ స్టార్ నితిన్..తెలుగు సినీ ప్రేక్షకులకు చివరగా ‘రంగ్ దే’ సినిమాలో కనిపించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ పిక్చర్ లో లవర్ బాయ్ గా నితిన్ చక్కటి నటన కనబరిచాడు. లవ్ స్టోరి ప్లస్ ఫ్యామిలీ డ్రామా అయిన ఈ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే నచ్చింది. ఇక ఆ తర్వాత నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ ఓటీటీలోనే విడుదలయింది.

డీస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ పిక్చర్ బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’కు రీమేక్. ఇక కొవిడ్ పరిస్థితుల వలన నితిన్ నటించిన సినిమాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. కాగా, తాజాగా నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ అప్ డేట్ వచ్చేసింది.

ఈ ఏడాది ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. నితిన్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ పిక్చర్ రాబోతున్నట్లు కనబడుతోంది. ఇందులో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ పిక్చర్ కు మ్యూజిక్ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీనాడే సమంత ‘యశోద’, అఖిల్ ‘ఏజెంట్’ పిక్చర్స్ విడుదల కానున్నాయి. అలా సమంత, అఖిల్ సినిమాలతో నితిన్ పోటీ పడనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news