ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లా సరిహద్దుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పోలీసులు చాలా మందిని పట్టుకున్నారు. ఆ సమయలో వారి నుండి అనేక మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏకంగా 14వేల కు పైగా మద్యం బాటిళ్లను మచిలీపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వాటన్నిటినీ ఒకటే చోటికి చేర్చిన వాటిని నేడు పోలీస్ గ్రౌండ్ లో రోడ్ రోలర్ తో తొక్కించి మరి ధ్వంసం చేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పి రవీంద్ర బాబు తో సహా అనేక మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు పట్టుకున్న మద్యం బాటిళ్లను బ్రాండ్స్ వారిగా విడదీసి వాటిని లైన్ లో పెట్టగా, అవి ఏకంగా 50 మీటర్ల దూరం చేరుకున్నాయి. ఆ తర్వాత పోలీస్ అధికారుల సమక్షంలో రోడ్డు రోలర్ తీసుకువచ్చి ఆ మద్యం బాటిళ్లను పూర్తిగా నాశనం చేశారు.