అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ తనది ఎంత మంచి మనసో మరోసారి చాటుకున్నారు. స్వతహాగా నవలా రచయిత అయిన మెకంజీ తన సంపదలో సగానికి పైగా విరాళం ఇస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మాట ఇచ్చిన ప్రకారం ఆమె మూడేళ్లలో 1400 కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. 16 వేల ఎన్జీవోలకు మెకంజీ డొనేషన్లు విరాళంగా అందజేశారని ఈల్డ్ గివింగ్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది.
ఈ వెబ్‌సైట్ లో మెకంజీ స్కాట్ ఏ సంస్థకు ఎంత విరాళం ఇచ్చారనే వివరాలు అన్నీ పొందుపరిచారు. ‘ఇతరులు, డొనేషన్స్ ఇచ్చేవాళ్లు, నా టీమ్ ఇచ్చే సమాచారం విరాళం ఇవ్వడంలో నాకు చాలా సహాయపడుతోంది’ అని స్కాట్ తెలిపారు. డొనేషన్స్ కావాలనుకునే సంస్థలు తమ వివరాలు పంపించాలని మెకంజీ తెలిపారు. ఇప్పటి వరకు మెకంజీ , ఆమె టీమ్ విరాళాలు ఇచ్చే ముందు ఆయా సంస్థల గురించి రహస్యంగా ఆరా తీస్తున్నారు.