మాధవ్ మ్యాటర్ క్లారిటీ ఇవ్వరా?

-

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే…దీనిపై ఎంపీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి…అలాగే వైసీపీపై కూడా విరుచుకుపడే పరిస్తితి ఉంది. అయితే ఆ వీడియో మార్ఫింగ్ చేశారని, టీడీపీ వాళ్లే ఇదంతా చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, అవసరమైతే ఫోరెన్సిక్ టెస్ట్ కు కూడా రెడీ అని మాధవ్ మాట్లాడారు.

కానీ దీనిపై వైసీపీ అధిష్టానం నుంచి పెద్దగా స్పందన రాలేదు…అలాగే వైసీపీ నేతల నుంచి మాధవ్ కు మద్ధతు దొరకలేదు. కాకపోతే ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించి…ఆ వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతే ఇంకా ఆ తర్వాత ఎంపీపై జగన్ సీరియస్ గా ఉన్నారని, ఆయనపై వేటు వేస్తారని మీడియాలో కథనాలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు సైతం…మాధవ్ పై వేటు పడొచ్చని పోస్టులు చేశారు.

ఇంతవరకు మాధవ్ సస్పెషన్ గురించి ఎలాంటి నిర్ణయం రాలేదు…అయితే వీడియోపై విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే జగన్…మాధవ్ మ్యాటర్ లో ఇంకా క్లారిటీ ఇవ్వలేదా? లేక ఈ విషయంపై సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారా? అనేది తెలియడం లేదు. వాస్తవానికి మాధవ్ వీడియో వచ్చిన నెక్స్ట్ రోజే…సజ్జల..సీఎం జగన్ తో భేటీ అయ్యారు…అప్పుడే మాధవ్ పై వేటు ప్రకటన వస్తుందని భావించారు. అలాగే జగన్ తో భేటీ అవ్వగానే సజ్జల మీడియాతో మాట్లాడతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

దీంతో మాధవ్ వ్యవహారంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వేటు వేయడం కంటే మౌనంగా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తే బెటర్ అని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రజాగ్రహం మరింత ఎక్కువైతే.. అప్పుడు ఫోరెన్సిక్‌ నివేదికలో ఏమొచ్చిందో వెల్లడించి.. నిర్ణయాన్ని ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ ఎంపీల మీటింగ్ లో మాధవ్ పాల్గొన్నారు. మొత్తానికి మాధవ్ మ్యాటర్ లో క్లారిటీ ఇప్పుడే వచ్చేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news