బిగ్ బాస్ లో సామాన్యులు ఉంటే TRP లు రావు : నటి మాధవీ లత

-

ప్రస్తుతం మా టీవీ లో ప్రతి రోజూ బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిగ్ బాస్ పై కీలక వ్యాఖ్యలు చేసింది నటి మరియు రాజకీయ నాయకురాలు మాధవీ లత. సోషల్ మీడియా లో నెటిజన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాధవీలత… బిగ్ బాస్ 7 ను నేను చూడడం లేదు, గతంలో బిగ్ బాస్ 2 కు నన్ను అడిగినప్పుడే నాకు డబ్బు కన్నా గౌరవమే ముఖ్యమని ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇపుడు జరుగుతున్న సీజన్ లో ఎవ్వరూ రాకపోవడంతో ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని గుంపును అంతా తీసుకువచ్చి హౌస్ లో పెట్టారంటూ మాధవీలత కామెంట్ చేశారు.. ఇక హౌస్ లో ఉన్న సామాన్యుడు పల్లవి ప్రశాంత్ ను ఉద్దేశించి మాట్లాడుతూ… హౌస్ లో సామాన్యులను పెడితే ఎవ్వరూ చూడడానికి అంతగా ఆసక్తి చూపరు మరియు మా టీవీ యాజమాన్యం ఆశిస్తున్న విధంగా TRP రేటింగ్ లు ఎక్కువగా రావని ఖరా ఖండీగా చెప్పేసింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో రెండు వారాలు పూర్తి కాగా.. కిరణ్ రావు మరియు షకీలలు ఎలిమినేట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news