పవన్ కళ్యాణ్ పై మాధవి లత సంచలన వ్యాఖ్యలు.. మత మార్పిడులకు కారణం మీరే !

-

పవన్ కళ్యాణ్ పై బిజెపి నేత, సినీ నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడులకు పవన్ కళ్యాణ్  ఆజ్యం పోస్తున్నారని మాధవి లత తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

” పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి. నమ్మిన వారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం మానవాళికి ఇలాంటి పెద్ద మాటలు ఎందుకండీ? మీరే మత మార్పిడులకు ఎంకరేజ్ చేసేలా మీ పోస్టు ఉంది. విషెస్ పెట్టండి. బైబిల్ ను మనమే బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరు దేవుడు లేరు. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. హిందూ మతస్థులను క్రైస్తవ మతం లోకి వచ్చేలా మీ పోస్టు ఉంది. ఇలాంటి పోస్టులు మానుకోండి” అంటూ మాధవి లత పవన్ కళ్యాణ్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు.

‘సర్వ ప్రాణుల పట్ల అని యేసు చెప్పలేదు. ఆయన చెప్పారని మొన్నటి వరకు నేను నమ్మిన మీలాగే.. కానీ యూదుల వరకు మాత్రమే ఆయన ప్రేమ. మనం యూదులం కాదండి. మీ పేజ్ మెయింటన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచింది. మొన్న మీరు కూడా స్పీచ్‌లో బైబిల్ గురించి గొప్పగా చెప్పారు.. అంతా గొప్ప ఏమి లేదండి ఫ్లోలో చెప్పేసి మీరు కూడా కన్వర్షన్స్‌కు కారణం అవ్వొద్దు. చాలా బాధగా ఉంది నాకు’ అని మాధవీలతా అన్నారు.

బైబిల్‌ను నమ్ముకున్నవారు స్వర్గానికి వెళతారు.. నమ్ముకొనివారు నరకానికి వెళ్తారు అని బైబిలో ఉంది. మనం నమ్ముకోలేదు కాబట్టి నరకానికి వెళతాం. అలాంటప్పుడు మనం క్రిస్మస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్?. వాళ్లు మన ధర్మాని, దేవుళ్లును అగౌరవపరుస్తున్నారు. మీరు మీ పిల్లలకు శాంటా గెటప్‌లు వేయించి, క్రిస్మస్ చెట్లు పెట్టుకుని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు’ అని అన్నారు.

కాగా… ఇవాళ క్రిస్మస్ పండుగ నేపథ్యంలో… క్రైస్తవ సోదరులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు మాధవి లత కౌంటర్ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news