తెలుగు ప్రజలకు అలెర్ట్… ఎల్లుండి నుంచి మళ్లీ వణుకుడే…!

-

తెలంగాణలో గత మూడు నాలుగు రోజుల నుంచి చలి కాస్త తగ్గుముఖం పట్టింది. చలి తీవ్రత తగ్గడంతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల క్రితం ముఖ్యంగా తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాలతో  పాటు ఏపీలో వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కారణంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పాటు పొగమంచు కూడా విపరీతంగా ఏర్పడింది.

కాగా మరోసారి తెలుగు ప్రజలకు అలెర్ట్ చేస్తుంది వాతావరణ శాఖ. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు చలి పంజా విసురుతుందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలపింది. సగటు కన్నా 2-4 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోతుందని హెచ్చిరిచింది. ముఖ్యంగా  ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలైన నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు ఏపీలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news