నా పెళ్లి అప్పుడే… క్లారిటీ ఇచ్చిన మాధ‌వీల‌త‌..!

-

ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను… అని నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ సంచలనంగా మారింది. దీంతో ఆమె పోస్టుపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈ భామ త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్కుతుంద‌ని ప్ర‌చారం చేశారు. మాధ‌వీల‌త స‌న్నిహితులు ఆమెకి శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేశారు. ఈ నేప‌థ్యంలో స్పందించిన మాధ‌వీ.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నా పెళ్ళి ఇప్ప‌ట్లో ఉండ‌దు. అందరు శుభాకాంక్ష‌లు చెబుతుంటే న‌వ్వు వ‌స్తుంది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అన్నీ కుదిరితే  2021లో పెళ్లి చేసుకుంటాన‌ని అంటుంది మాధ‌వీల‌త‌.

Read more RELATED
Recommended to you

Latest news