కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది- కాంగ్రెస్ నేత మధుయాష్కీ

-

టీ కాంగ్రెస్ లో చెలరేగిన తుఫాన్ ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో అవమానకర రీతిలో, డిపాజిట్ కూడా దక్కించుకోలేక చతికిల పడ్డ కాంగ్రెస్ లో అసంత్రుప్త స్వరాలు పెరుగుతున్నాయి. నేతలు బహిరంగంగా మీడియా ముఖంగానే టీ కాంగ్రెస్ పార్టీ తీరుపై వ్యాఖ్యలు చేస్తున్నారు. కోమటిరెడ్డి, ప్రేమ్ సాగర్ రావుల వ్యవహారం కాంగ్రెస్ పెనం నుంచి పొయ్యిలో పడేలా చేసింది. దీంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే అసంత్రుప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే పనిలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

తాజాగా మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ పార్టీ పరిస్థితిపై నేతలు వ్యవహరించాల్సిన తీరుపైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉందన్నారు. ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని నాయకులకు సూచించారు. పార్టీలో అందరికి సమస్యలు ఉన్నాయని.. వాటిని బహిరంగంగా కాకుండా పార్టీ వేదికలపై మాట్లాడుకోవాలని హితవు పలికారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేరుగా సోనియాతో మాట్లాడే వెసులుబాటు ఉందన్నారు మధుయాష్కీ. కోమటి రెడ్డి వ్యవహారంపై వీహెచ్ మాట్లాడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news