కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. తెలంగాణలో 5వ రోజుకు చేరుకున్న ఈ యాత్ర జడ్చర్ల మండలం గొల్లపల్లి నుంచి రాహుల్ జోడో యాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. అయితే రాహుల్ పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. తెలంగాణలో ప్రభుత్వం అన్ని వనరులను దోచుకుంటుందని.. ఆపరేషన్ బొగ్గు వ్యాపారం విస్తరణ కోసం జరిగిందన్న మధుయాష్కి.. చంద్రగుప్త కోల్ ప్రాజెక్టు దక్కించుకునేందుకే రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరారని ఆరోపించారు.
రాజగోపాల్ రెడ్డి చెప్పే మాటలన్నీ బూటకాలేనని అన్నారు. మునుగోడు ప్రజలను ముంచి వ్యాపారం కోసం రాజగోపాల్ రెడ్డి పాకులాడారని విమర్శించారు. మునుగోడు ప్రజలకు పేలాలు పంచి ఆయన బిర్యాని తింటున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు మంచి తీర్పు ఇవ్వకుంటే భవిష్యత్తులో రాజకీయం నీచంగా మారుతుందని అన్నారు మధుయాష్కి గౌడ్.