ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక పూర్తి వివరాలను చూస్తే.. ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మొత్తం పోస్టులను 265 భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలలోకి వెళితే.. అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, డేటా ఎట్రీ ఆపరేటర్, రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. వయసు అక్టోబర్‌ 31, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ళు ఉండాలి. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో యాభై శాతం ఉండాలి. అలానే స్కిల్‌ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ గురించి చూస్తే… ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 12, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ గురించి చూస్తే.. రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news