కూలీ డబ్బులు ఇవ్వమన్న పాపానికి చేతినే తెగనరికాడు…

-

తనకు వచ్చే కూలీ డబ్బులు అడిగినందుకు చేతులనే నరికాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణం          మధ్యప్రదేశ్ రేవా జిల్లా సిర్మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోల్ మౌ గ్రామంలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన అశోక్ సాకేత్ (45) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గణేష్ మిశ్రా అనే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. అయితే ఇటీవల తనకు రావాల్సిన కూలీ డబ్బులు ఇవ్వాని కోరాడు. అయితే రేపుమాపు అంటూ తప్పించుకుంటున్న గణేష్ మిశ్రాను గట్టిగా నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాాటాామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.

దీంతో ఆగ్రహానికి గురైన గణేష్ మిశ్రా పదునైన ఆయుధంతో అశోక్ సాకేత్ చేతిని తెగనరికాడు. భయపడిన అశోక్ పారిపోయి స్థానికంగా ఉన్న సిర్మౌర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లేలోగా రెండు గంటు దాటిపోవడంతో తెగిపడిన చేతిని డాక్టర్లు అతికించడం సాధ్యం కాదని చెప్పారు.

భాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుడు గ‌ణేశ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. గ‌ణేశ్ మిశ్రాతోపాటు ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డే ఉన్న‌ అత‌ని సోద‌రులు ర‌త్నేశ్ మిశ్రా, క్రిష్ణ మిశ్రాల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురిపైనా ఐపీసీ సెక్ష‌న్ 307 కింద కేసు న‌మోదు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news