ఈ రోజుల్లో పబ్ జీ ఆటలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు కొందరు. ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. పబ్ జి మీద దృష్టి పెట్టి చివరకు జీవితాలను కూడా కోల్పోతుంది యువత. ఆడ మగా, చిన్న పెద్దా అనే తేడా లేకుండా పబ్ జి కి బానిస అయిపోతున్నారు యువత ఇందుకోసం చదువుని, ఉద్యోగాలను కూడా యువత వదిలేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు పబ్ జిలో పడి ప్రాణాలే కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.
సౌరభ్ యాదవ్ (20) తన స్నేహితుడు సంతోష్ శర్మతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు. వాళ్ళు భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్నారు. వెండి తో ఉన్న బాగ్ ని యాదవ్ తీసుకువెళ్తున్నాడు. ఇక ఇదే సమయంలో ఆ ఆభరణాలను శుభ్రం చేసేందుకు గాను ఉపయోగించే యాసిడ్ కూడా ఆ బాగ్ లో ఉంది. రైల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పబ్ జి ఆడుతూ… యాదవ్… దాహం వేయడం తో ఆ బాగ్ లో ఉన్న… బాటిల్ తీసుకుని మంచి నీళ్ళు అనుకుని తాగాడు… శర్మ స్పందించే సమయానికే అతను మొత్తం తాగాడు…
రైలు ధోల్పూర్ వద్ద ఆగనందున, యాదవ్‌కు చికిత్స అందించడం కుదరలేదు. దీనితో చికిత్స అందే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా… తాను నిత్య౦ ఆగ్రాలోని సారాఫా బజార్‌కు తీసుకువెళ్తానని… అనుకోకుండా అతను ఇలా తాగేసాడని శర్మ పేర్కొన్నాడు… ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శర్మ… తమ అబ్బాయికి కావాలనే యాసిడ్ ఇచ్చాడని… అందుకే ఈ ఘటన జరిగిందని యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.