కరోనాలో తల్లి తండ్రులు మరణిస్తే పిల్లలకు 5 వేలు పెన్షన్… సీఎం సంచలన నిర్ణయం

తల్లి తండ్రులు కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడుతున్న చిన్నారులను మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఈ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీనితో ప్రభుత్వాలు వారి కోసం ఏదోక నిర్ణయం తీసుకోవాలి అంటూ ఎవరికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ సిఎం ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు.

కోవిడ్ మహమ్మారి తో తల్లిదండ్రుల ను,సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు నెలకు 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన పిలల్లకు ఉచితంగా చదువుతో పాటుగా ఉచిత రేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.