కష్టపడి పనిచేసినా విజయం నీ వశం కావట్లేదా? ఐతే ఇది తెలుసుకో..

-

చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకూ ప్రతీ ఒక్కరూ చెప్పే మాటే. కష్టపడి పని చేయండి. అప్పుడే మీరనుకున్నది సాధించగలుగుతారు. ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారు, పాఠశాలలో మార్కుల దగ్గర నుండి మైదానంలో గెలవాలనుకున్న కప్పు వరకూ ప్రతీదీ కష్టపడితేనే గెలవగలమని చెబుతుంటారు. ఐతే గెలవాలంటే నిజంగా కష్టపడాలా? కష్టపడినా గెలుపు రాకపోవడానికి కారణాలేంటనేది ఈరోజు తెలుసుకుందాం.

పాఠశాలలో చదువు మీద ఆసక్తి చూపని విద్యార్థి మైదానంలో గంటల తరబడి క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడు. గంట కూడా పుస్తకం ముందు పెట్టుకుని చదవలేని విద్యార్థి గంటల కొద్దీ క్రికెట్ ఆడతాడు. దానికి కారణం పెద్ద తెలియనిదేం కాదు. కష్టంగా కదలలేని బండి ఇష్టంతో కదులుతుంది. మనకు నచ్చని పని చేయాలంటే మనసు నప్పదు. అప్పుడే అది కష్టంగా మారితుంది. కష్టంతో పని చేస్తున్నప్పుడు ఆ పని ఆలస్యమవడంతో పాటు అది చేస్తున్నప్పుడు ఎప్పుడు పనైపోతుందా అని ఎదురుచూస్తూనే ఉంటాం.

చేస్తున్న పనిని ఆస్వాదించలేనపుడు ఆ పనిచేయడం ఎందుకు? ఒక పని నీకు నచ్చలేదంటే కష్టంగా మారిపోతుంది. అందుకే పనినైనా మార్చాలి. లేదా నీకు ఇష్టంగా దాన్ని మార్చుకోవాలి. ఏది ఏమైనా పని చేస్తున్నప్పుడు నీకు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అనిపించకూడదు. అలా అనిపించిందంటే నువ్వు నీ పని మానేసి మరేదో కోరుకుంటున్నావు అన్నట్టు లెక్క. కష్టం వల్ల కలిగేదే అది.

నీకు ఇష్టం లేని పని చేస్తూ గెలవడానికి చాలా కష్టపడుతున్నాను అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. కష్టపడ్జుతున్నందుకు ఎదుటి వాళ్ళు నీ మీద సానుభూతి చూపిస్తారు. అదే విజయం అనుకుని నువ్వు సంబరపడిపోతే అక్కడే ఆగిపోతావు. అందుకే బయటకి రా.. రెక్కలు విప్పుకో.. కష్టంతో చేయకు.. ఇష్టంగా మార్చుకో. అలా కాని పక్షంలో ఇష్టం ఉన్న పనిలో చేరిపో. విజయం రాకపోయినా రోజూ పనిచేసుకుంటూ కుమిలిపోయే క్షణాలు మాత్రం ఉండవు. ఈ రెండింటిలో ఏది విజయమో నువ్వే ఆలోచించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news