ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. రతన్ టాటా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు జరుగనున్నాయి.
రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇవాళ నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఈ మేరకు తీర్మాణాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ తీర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. దేశ పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా గొప్ప మానవతావాది అయిన రతన్ టాటాకు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.