కరోనా కల్లోలం : హోం మంత్రికి పాజిటివ్‌

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా మన దేశంలోని చాలామంది మృతి చెందారు. పేద మరియు ధనిక అనే తేడా లేకుండా… ప్రతి ఒక్కరిని కదిలించివేసింది కరోనా మహమ్మారి. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మరియు దిగ్గజ వ్యాపారస్తులు కూడా కరోనా బారిన పడ్డారు.

ఇక తాజాగా మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్స్ పాటిల్ కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకున్నాను అని… కరోనా పాజిటివ్ వచ్చిందని పాటిల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. డాక్టర్ల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. నాగపూర్ మరియు అమరావతి పర్యటన సందర్భంగా తనతో పాటు పాల్గొన్న వారు కరోనా పరీక్షలు కచ్చితంగా చేయించు కోవాలని సూచనలు హోంమంత్రి దిలీప్. ఈ విష యాన్ని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.