మహారాష్ట్రలో తాజాగా జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ లపై జరుగుతున్న ఆందోనళ హింసగా చెలరేగుతోంది. మాలెగావ్ లోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటిపై నిరసన కారులు ఆందోళనలు చేపట్టడమే కాకుండా, ఇంటికి నిప్పు అంటించారు, మరియు ఇంట్లో ఉన్న వాహనాలను కూడా ద్వంసం చేశారు. ఈ దారుభమైన ఘటనపై స్పందించిన మాలెగావ్ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి, ఘటన జరుగుతున్న సమయంలో నేను ఇంట్లోనే ఉన్నానంటూ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా సోలంకి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఈ ఘటనపై స్పందించి నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కానీ నిరసనలు తెలుపుతున్న వీరు కుదుటపడతారా అన్నది చెప్పలేని పరిస్థితి… వెంటనే ప్రభుత్వాలు మేలుకొని వారితో ఒక ఒప్పందానికి రాకపోతే సమస్య ఎక్కువయ్యేలా ఉందని ప్రముఖులు చెబుతున్నారు