మహారాష్ట్రలో ‘హనుమాన్ చాలీసా’ వివాదం…

-

మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాలీసా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పటికే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మసీదులపై లౌడ్ స్పీకర్లు తీయకుంటే… మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని… మే 3 తరువాత కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గతంలో తెలుగు లో హీరోయిన్ గా యాక్ట్ చేసి, ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్ దంపతులు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇళ్లు మాతో శ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఛాలెంజ్ చేశారు. ఎంపీ నవనీత్ కౌర్ ఆమె భర్త ఎమ్మెల్యే రవిరాణా ఇద్దరు ఉద్ధవ్ ఠాక్రే ఎదురుగా హనుమాన్ చాలీసా పఠించేందుకు సిద్ధం అయ్యారు.  ఈనేపథ్యంలో శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్ ఇంటిని ముట్టడించారు. మరోవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే వారిని ఇలా ఎవరో చేయాలని ప్రేరేపించినట్లు శివసేన లీడర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆమె భర్త రవిరాణా బద్నేరా నియోజవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news