ఒడిషా రైలు ప్రమాదంపై స్పందించిన రామ్ చరణ్ & మహేష్ బాబు… !

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకా వందలమంది ప్రయాణికులు ప్రాణాలతో హాస్పిటల్ లో పోరాడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా సీఎంలు, రాజకీయ నాయకులు స్పందించి వారికీ తాము ఏమి చేయగలమో చెప్పారు. కాగా ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం సినీ నటులు కూడా స్పందించడం విశేషం. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు , రామ్ చరణ్ లు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ ప్రమాదం చాలా బాధించిందని తమ బాధను వ్యక్తపరిచారు. సరైన సేఫ్టీ లేకపోవడం వలనే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు మహేష్ బాబు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే శాఖ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

 

ఇక రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా బాలాసోర్ రైల్ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని ప్రకటించారు. ఇక బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.