ఒడిశా రైలు ప్రమాద ఘటనపై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష

-

ఒడిశాలో నిన్న రాత్రో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురుంచి తెలిసిందే. అయితే, ప్రమాద ఘటనపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి కనపరిచారు. ఇది అత్యంత దురదృష్టకర, బాధాకర ఘటన అని అన్నారు ఆమె. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు హోం మంత్రి. . క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏపీ నుండి ఘటనాస్థలికి బృందాలు వెళ్లినట్లు ఆమె తెలిపారు.

Govt committed to empowerment of women: Taneti Vanitha

అధికారుల బృందాలు ఏపీ కు చెందిన ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నాయని సమాహారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ – 1070, 112, 18004250101. మీకు సంబంధించి మిస్సయిన వారి సమాచారం కోసం 8333905022 నెంబర్‌కు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేయాలని సూచించారు. పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news