ఎన్టీఆర్ కోసం రంగంలోకి మహేష్ బాబు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతం లో ఈ షో పేరు మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఉండగా నాగార్జున, చిరంజీవి హోస్ట్ లు గా వ్యవహరించారు. అయితే మొదట్లో ఈ షోకు క్రేజ్ కనిపించినా ఆ తరవాత డల్ అయ్యింది. కొన్ని సీజన్ ల తరవాత ఈ షోను నిలిపివేశారు. అయితే మళ్ళీ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టివి లో తిరిగి ప్రారంభించారు. మొట్ట మొదటగా రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ తరవాత పలువురు ప్రముఖులు కూడా అతిధులుగా వచ్చారు.

రాజమౌళి, కొరటాల శివ కూడా ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో మెరిశారు. అయితే షో టీఆర్పీ రేటింగ్ మాత్రం ఆశించినంతగా రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన తరవాత ఎపిసోడ్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ను రంగం లోకి దించుతున్నట్టు తెలుస్తోంది. దాంతో షో క్రేజ్ ను పెంచే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక సూపర్ స్టార్ ఎవరు మీలో కోటీశ్వరుడు కు వస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.