గూగుల్‌లో మీకు కావాల్సిన ఇమేజ్ కనపడలేదా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఈ మద్య టెక్నలజీ బాగా అభివృద్ధి చెందింది. ఏదైనా మనం ఇంటర్నెట్ తో ఈజీగా పొందొచ్చు. అయితే మీరు ఏదైనా ఫోటో కోసం వెతికి పొందలేకపోతే ఇలా చెయ్యండి. గూగుల్​లో లో కనుక సెర్చ్ చేసారు అంటే క్షణాల్లో తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది చూసేస్తే.. వీటిని ఫాలో అవ్వడం ద్వారా యూజర్లు తమకు కావాల్సిన ప్రతీ ఇమేజ్​ను హై క్వాలిటీలో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

గూగుల్‌ సెర్చ్‌లో ఇమేజ్ వచ్చాక దానిపై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని ఇమేజెస్ కనబడుతాయి. అందులో మీకు కావాల్సిన ఇమేజ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదే ఇమేజెస్ దొరకనప్పుడు గూగుల్ అందించే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మీరు క్వాలిటీ ఇమేజెస్ ని డౌన్ లోడ్ చెయ్యచ్చు.

దీని కోసం మొదట బ్రౌజర్‌లో https://images.google.com/ అని టైప్ చేయండి.
నెక్స్ట్ వెబ్ పేజ్‌లోని కెమెరా ఐకాన్‌కు ఎడమ వైపునకు ఉన్న సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి లేదా అప్‌లోడ్ యాన్ ఇమేజ్ ట్యాబ్ ద్వారా ఫోటోని అప్లోడ్ చేయండి.
ఇప్పుడు ఇమేజెస్ ని సెర్చ్ చేస్తుంది.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లైతే మీరు సెర్చ్ చేయాలనుకున్న శాంపిల్ ఇమేజ్‌పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్​ను ఎంచుకోండి. ఇలా మీరు ఇమేజ్ ని పొందొచ్చు.
అలానే మీరు ఇమేజ్‌ను గూగుల్ ఇమేజెస్ సైట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా సిమిలార్ ఇమేజెస్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. రివర్స్ సెర్చ్ ద్వారా ఇమేజెస్ సెర్చ్ చేయాలనుకుంటే మీ ఫోన్‌లో గూగుల్ యాప్ అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news