హాలీవుడ్ మూవీకి మహేష్ బాబు కూతురు సితార వాయిస్ ఓవర్……!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో స్థానానికి పోటీ పడే హీరోల్లో మహేష్ బాబు ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, చిన్నవయసులోనే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు మహేష్.

ఇక ప్రస్తుతం ఆయన బాటలోనే తనయుడు గౌతమ్ కృష్ణ, ఇటీవల మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ గా ఒక ప్రత్యేక పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కుమార్తె సితార మాత్రం ఇప్పటివరకు సినిమాల్లోకి రాకపోయినప్పటికీ, ఎంతో చాలాకీగా వ్యవహరిస్తూ, ఇటీవల వంశీ పైడిపల్లి కూతరు ఆద్యతో కలిసి ఏకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుండి తండ్రి వలే ఎంతో చలాకీగా అన్నిట్లో ముందుండే సితార, సినిమా రంగ ప్రవేశానికి మొత్తానికి  ముహూర్తం కుదిరింది. అది కూడా టాలీవుడ్, బాలీవుడ్ సినిమానో కాదు, ఏకంగా హాలీవుడ్ సినిమా ద్వారా.


వివరాల్లోకి వెళితే, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హాలీవుడ్ క్రేజీ యానిమేటెడ్ అడ్వెంచరస్ మూవీ ఫ్రోజెన్ 2. భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ సినిమాలోని ప్రధాన పాత్రైన ‘ఎల్సా’కు తెలుగు వర్షన్ లో సితార తన వాయిస్ ని అందించబోతోందని డిస్నీ సంస్థవారు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ న్యూస్ బయటకు వచ్చిన దగ్గరినుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ దీనిని మరింత వైరల్ చేస్తూ, ఎంతైనా సూపర్ స్టార్ కూతురంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news