ఏజెంట్ టీజర్‌పై మహేష్ బాబు ఆసక్తికర ట్విట్

-

డైరెక్టర్ సురేందర్ దర్శకత్వంలో యంగ్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాలు అఖిల్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా సాక్షి వైద్య నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇటీవల ఏజెంట్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

అఖిల్-మహేశ్ బాబు
అఖిల్-మహేశ్ బాబు

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతం అందించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర సినిమాను నిర్మిస్తున్నారు. ఈ టీజర్‌పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఏజెంట్ టీజర్‌పై ఆసక్తికరమైన ట్విట్ చేశారు. ‘ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, థీమ్ చాలా బాగున్నాయి. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్.’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనికి అఖిల్ రీట్విట్ చేశారు.‘థ్యాంక్యూ.. మీ సపోర్ట్, ప్రోత్సాహం ఉన్నందుకు సంతోషం’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news