ఆ హీరో అంటే చాలా అభిమానం అంటున్న చైతూ.. కారణం..?

-

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో యువసామ్రాట్ నాగచైతన్య తన నటనతో తానేంటో నిరూపించుకుంటున్నాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాతో తన టాలెంట్ ని బయటపెట్టిన నాగచైతన్య ఆ తర్వాత బంగార్రాజు సినిమాతో కూడా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఏరకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులలో అంత క్రేజ్ సంపాదించుకున్న హీరోలకి కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలు కూడా అభిమానులుగా మారితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా తమకంటూ ప్రత్యేకమైన అభిమాన హీరోలు ఉన్నారని పలు ఇంటర్వ్యూల ద్వారా తెలిపారు. అంతేకాదు వీరు స్టార్ సెలబ్రిటీలు గా ఉండటమే కాకుండా కొన్ని సినిమాలలో మరో స్టార్ హీరోకి అభిమానిగా కనిపిస్తూ.. పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో నాగచైతన్య కూడా ఒక హీరోకి వీరాభిమాని. ఇటీవల విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం థాంక్యూ. ఈ సినిమాలో నాగచైతన్య, మహేష్ బాబు కి వీరాభిమానిగా కనిపిస్తారట. ఇక ఈ విషయం తెలియగానే మహేష్ బాబు అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఈనెల 22వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టగా ఇక ఇందులో కొన్ని విషయాలను కూడా వారు వెల్లడిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్ , ట్రైలర్స్ కు పెద్ద ఎత్తున మంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు పెరగడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news