లేడీ డైరెక్టర్ తో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ..?

-

మహేష్ బాబు సర్కారు వారి పాట దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో బ్యాంకు మోసాల కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే ఈ సినిమా విడుదల సమయాన్ని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా వచ్చే సంవత్సరం సర్కారు వారి పాట సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట. ఐతే ఈ నేపథ్యంలో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఆకాశం నీ హద్దురా సినిమా దర్శకత్వం వహించిన సుధ కొంగర తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆకాశం నీ హద్దురా సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న సుధ కొంగరతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అందుకే ఈ వార్త నిజమైతే బాగుండని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news