వలస కార్మికులకి వరం లాంటి వార్త వచ్చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. వన్ నేషన్ వన్ కార్డును దేశం మొత్తంలో ఈ ఏడాది చివరి నాటికి అంతటా అమలు చేసేలా చర్యలు జరపనున్నట్లు తెలిపారు. దీనివల్ల వలస కార్మికులకు ఇబ్బందులు తొలగిపోతాయి. పనికోసం ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వచ్చేవారికి రేషన్ బియ్యం దొరకడం లేదు. దానికోసం ఒకే కార్డు ఉంటే ఎక్కడైనా బియ్యం తీసుకునే విధంగా అమలు చేస్తున్నారట.
అలాగే ఒక కుటుంబంలో నలుగురు మనుషులు ఉంటే, ముగ్గురికి సంబంధించిన కోటా ఒక దగ్గర, మరో వ్యక్తి కోటా మరో చోట తీసుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. అంటే ఎవరికి సంబంధించిన కోటా వారే తీసుకునే విధంగా, ఎక్కడైనా తీసుకునేట్టు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్- వన్ కార్డు బాగా అమలు జరుగుతుందని వెల్లడించారు. మొత్తానికి వలస వచ్చిన వారికి రేషన్ కష్టాలు తీరినట్టే అని చెప్పవచ్చు.