టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన ‘మనసంతా నువ్వే’ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ పిక్చర్ కు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అయితే, ఈ చిత్రాన్ని నిర్మాత ఎం.ఎస్.రాజు మహేశ్ బాబుతో తీయాలనుకున్నారు. కానీ, ఈ మూవీని మహేశ్ చేయలేకపోయారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు ‘మనసంతా నువ్వే’ చిత్రాని కంటే ముందర ‘దేవి పుత్రుడు’ పిక్చర్ చేసి నష్టపోయారు. ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్ తో హిట్ సినిమ చేయాలనుకున్నారు. అప్పుడు గోపాల్ రెడ్డి సలహా తో అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పని చేస్తు్న్న వీఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి పిలిపించుకుని తన వద్ద ఉన్న ఒక లైన్ చెప్పాడు. దాంతో చిన్న బడ్జెట్ లో స్టోరి రెడీ చేయాలని చెప్పాడు. అప్పుడు వీఎన్ ఆదిత్య డెవలప్ చేసిన విధానం చూసి అడ్వాన్స్ ఇచ్చి వీఎన్ ఆదిత్యను దర్శకుడిగా ఓకే చేశారు ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు.
అప్పటికే సినిమా టైటిల్ ను ‘మనసంతా నువ్వే’గా కన్ఫర్మ్ చేశారు. అయితే, ఈ స్టోరిని మహేశ్ తో చేయాలని భావించిన ఎం.ఎస్.రాజు ..స్టోరిని మహేశ్ కు వినిపించారు. స్టోరి బాగున్నప్పటికీ అప్పటికే మహేశ్ గుణశేఖర్ తో ఫిల్మ్ కమిట్ అయి ఉండటంతో వదులుకున్నాడని టాక్.
అలా నెక్స్ట్ ఈ స్టోరిని ‘నువ్వు నేను’ షూటింగ్ లో ఉన్న ఉదయ్ కిరణ్ కు వినిపించారు. అలా ఈ స్టోరి ఉదయ్ కిరణ్ కు నచ్చగా, సినిమా షూటింగ్ జరిగింది. ఇక ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత సంచలనం సృష్టించింది. తర్వాత ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా సక్సెస్ అయింది.