IPL DC vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

-

ఐపీఎల్ 2022 లో భాగం నేడు ఇద్ద‌రు వ్యూచ‌ర్ లో టీమిండియ కెప్టెన్స్ అయ్యే అవ‌కాశాలు ఉన్న కెప్టెన్ మ‌ధ్య పోరు న‌డుస్తుంది. రిషబ్ పంత్ సార‌థ్యంలో గ‌ల ఢిల్లీ క్యాపిట‌ల్స్, కెఎల్ రాహుల్ నేతృత్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ ముంబై న‌గరంలోని డీవై పాటిల్ స్టేడియంలో జ‌రుగుతుంది. కాగ మ్యాచ్ లో భాగంగా కీల‌క మైన‌ టాస్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ గెలిచింది.

ముందుగా బౌలింగ్ చేయాల‌ని కెప్టెన్ కెఎల్ రాహుల్ నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ కెప్టెన్సీ లోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముందుగా బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టులో డేవిడ్ వార్న‌ర్ వ‌చ్చాడు. తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు :
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ ( కెప్టెన్ / వికెట్ కీప‌ర్ ), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్టే

లక్నో సూపర్ జెయింట్స్ తుది జ‌ట్టు :
కెఎల్ రాహుల్ ( కెప్టెన్ ), క్వింటన్ డి కాక్ ( వికెట్ కీప‌ర్ ), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news