కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లె గ్రామంలో ప్రణయ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ మేరకు అడిషనల్ డిసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ తన సోదరిని ప్రేమిస్తున్నాడని కక్ష్య పెంచుకున్న అనిల్ అనే వ్యక్తి ప్రణయ్ ని హత్య చేశాడని పేర్కొన్నారు. తన చెల్లెలితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం ఇష్టం లేక ప్రణయ్ ని దారుణంగా హత్య చేసినట్లు నిర్దారణ అయిందని ఆయన మీడియాకి వెల్లడించారు.
నిన్న అర్ధరాత్రి అనిల్ సోదరితో ప్రణయ్ మాట్లాడుతుండగా చూసి ఆవేశంతో ఒక్కసారిగా ప్రణయ్ ని కర్రలతో కొట్టి చంపారని తేలిందని డీసీపీ పేర్కొన్నారు. హత్యపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణాలో ఈ తరహ కేసులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ముందు మిర్యాలగూడ ప్రణయ్, మొన్న తాజాగా హేమంత్, ఇప్పుడు మరో ప్రణయ్ ఈ ప్రేమ కి బలయ్యారు.