వరదల తీవ్రతకు హైదరాబాద్ చాలా ఇబ్బందులు పడుతుంది. వరదల దెబ్బకు ప్రజలు ఆర్ధికంగా చాలా కష్టాలు పడుతున్నారు. వరదల నుంచి బయటకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే ప్రజలకు ఆర్ధిక సహాయం చేయడానికి పలువురు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళనాడు సిఎం పళని స్వామి తెలంగాణకు పది కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు.

దీనిపై తెలంగాణా సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేసారు. సీఎం కెసిఆర్ తమిళనాడు సీఎం పలనిస్వామి కి ఫోన్ చేసి రాష్ట్రానికి ఆర్థిక సహాయం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఆయనకు ఫోన్ లో వివరించారు. నగదు సహాయంతో పాటు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నారు అంటూ సిఎం… పళని స్వామిని అభినందించారు.