హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టతో పాటు పలు కాలనీలు జలమయం కావడానికి పల్లెచెరువుకు గండి పడడమే కారణం అని తెలుస్తుంది. ఇప్పటికీ పల్లెచెరువు నుంచి పెద్దమొత్తంలో నీరు దిగువకు ప్రవహిస్తోంది. పల్లెచెరువుకు ఎగువన గల కొత్తచెరువు, జల్‌పల్లి చెరువులు ఉన్నాయి. అవి పూర్తిగా నిండి… గట్లు తెగిపోవడంతో ఆ నీరంతా పల్లెచెరువులోకి వచ్చింది.
దీంతో మంగళవారం అర్థరాత్రి సమయంలో పల్లెచెరువు కట్ట సగం వరకూ తెగి… వరద నీరు ఫలక్‌నుమా ప్రాంతాన్ని ముంచెత్తింది. ఈ పరిస్థితుల్లో మరోసారి వరద వస్తే… మరోవైపు కూడా ఇప్పటికే బలహీనంగా మారిన చెరువు కట్ట తెగిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీంతో ఇసుక బస్తాలను వేసి చెరువు కట్టను పటిష్టం చేసే పనిలో ఉన్నారు అధికారులు.