మేజర్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మహేష్ బాబు

-

మహేష్ బాబు ఒక పక్క సినిమా హీరోగా నటిస్తూనే మరో పక్క రకరకాల వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన నిర్మాతగా మారి మొదటి సారి వేరే హీరోని పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు మేజర్. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు ప్రకటించాడు. జులై రెండో తారీఖున ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

26/11 ముంబై ఎటాక్ లో టెర్రరిస్టులతో పోరాడుతూ తన ప్రాణాలు కోల్పోయిన సందీప్ ఉన్నికృష్ణన్ అనే పోలీసు అధికారి జీవితం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. గూడచారి సినిమాని తెరకెక్కించిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. హిట్ కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ అంచనాలను ఏ మేరకు అందుకునేలా చేస్తాడో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version