మ‌రోసారి డ్ర‌మ్స్ వాయించిన మోడీ..నెటిజ‌న్లు ఫిదా..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రోసారి డ్ర‌మ్స్ వాయించి నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి స్కాట్ లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే అక్క‌డ కొంత‌మంది భార‌తీయుల‌తో క‌లిసి మోడీ ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్ర‌ధాని డ్ర‌మ్స్ వాయించారు. ఆ ఈవెంట్ కు వ‌చ్చిన భార‌తీయులంతా మ‌న దేశ సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి హాజ‌ర‌య్యారు. ఇక ఈవెంట్ పూర్త‌వ్వ‌గానే ప్ర‌ధాని ఇండియాకు పయ‌న‌మయ్యారు.

modi drums playing scotland
modi drums playing scotland

ఇక ఈవెంట్ ప్ర‌ధాని ప్ర‌తి ఒక్క‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ప్ర‌తి పిల్ల‌వాడిని ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. అంతే కాకుండా పెద్ద‌ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ ప‌ల‌క‌రించారు. ఇక ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌గా ప్ర‌ధాని కూడా త‌న టాలెంట్ ను బ‌య‌ట‌పెట్టారు. ఇదిలా ఉంటే ప్ర‌ధాని కాప్ 26 స‌ద‌స్సు కోసం గ్లాస్ గో కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇక గ‌తంలోనూ ప్ర‌ధాని ఓసారి డ్రమ్స్ వాయించి నెట్టింట వైర‌ల్ అయ్యారు.