మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ బిజినెస్ ఐడియా. ఎ4 పేపర్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తే చక్కని లాభాలను పొందొచ్చు. మరి ఆ బిజినెస్ గురించి, ఆ బిజినెస్ వలన వచ్చే ప్రాఫిట్స్ గురించి ఒక లుక్ వేసేయండి. మనం ఎక్కువగా ఎ4 పేపర్లను వాడుతూ ఉంటాం. ఈ వ్యాపారాన్ని చక్కని ఆదాయ వనరుగా కూడా మార్చుకో వచ్చు. జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు మొదలైన చోట ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే వీటిని తయారు చెయ్యాలంటే కచ్చితంగా పేపర్ రోల్ మేకింగ్ మెషిన్ అవసరం.
దీని ధర రూ.5 లక్షల వరకు ఉంటుంది.. అదే విధంగా జీఎస్ఎం ఎ4 పేపర్ రోల్స్ అవసరం అవుతాయి. ఒక్కో కేజీ రోల్ ధర రూ.60 వరకు ఉంటుంది. ఇవి మనకి ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి. ఎలా తయారు చెయ్యాలి అనేది చూస్తే… మెషిన్‌లో ఎ4 పేపర్ రోల్స్‌ను పెట్టి వాటిని పేపర్లుగా కట్ చేయాలి. అనంతరం వాటిని ప్యాక్ చేసి విక్రయించాలి.
ఈ పనిని మనం ఇంట్లో ఒక గదిని చూసుకుని చేసుకోచ్చు. ఎ4 పేపర్ బండిల్స్ ధర పేపర్ల జీఎస్ఎం క్వాలిటీని బట్టి ఉంటుంది. సాధారణంగా ఒక్క ఎ4 పేపర్ బండిల్ తయారీకి రూ.100 వరకు ఖర్చవుతుంది. దాన్ని మార్కెట్‌లో రూ.180 నుంచి రూ.200కు సెల్ చెయ్యచ్చు. ఇలా ఒక్కో బండిల్‌పై ఎంత లేదన్నా కనీసం రూ.80 మార్జిన్ వస్తుంది. ఇలా నెల నెలా మంచి ఆదాయం సంపాదించవచ్చు.