మహిళా ఏసీపీ వేళ్లను నరికేసిన వ్యాపారి

ఓ మహిళ ఏసీపీ అధికారి పట్ల చిరువ్యాపారులు దారుణంగా ప్రవర్తించారు. అక్రమ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని.. వాటిని ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై వ్యాపారులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పిత పింపుల్ చేతి ముడు వేళ్ళు నరికారు. ఈ ఘటన ముంబై లోని థానే లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే థానే మున్సిపల్ కమిషనర్ విపిన్ శర్మ ఆదేశాలతో వీధి వ్యాపారుల పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఘెడ్ బందర్ రోడ్డు లో సోమవారం… వ్యాపారాలు ఖాళీ చేయించడానికి అధికారులు అక్కడికి చేరుకోగా.. ఈ నేపథ్యంలోనే వీధి వ్యాపారులు మరియు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఏసీపీ పై కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కల్పిత పింపుల్ ముడు వేళ్ళు తెగిపడ్డాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. ఒక చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఇక ఏసీపీ తో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డుకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఈ దాడి కేసులో నిందితుడు అమర్జిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.