స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. అయితే వాట్సాప్ ని సురక్షితంగా ఉపయోగించుకోవాలంటే ఈ ఫీచర్స్ ని వాడండి. వాట్సాప్ అందించే ఈ ఫీచర్స్ ని వాడుకుంటే మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ గా ఉంటుంది.
మీరు మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ గా ఉండాలని అనుకుంటున్నారా అయితే తప్పకుండా వీటి కోసం తెలుసుకోండి. జనరల్ గా మనం ఎక్కువగా స్నేహితులతో కుటుంబ సభ్యులతో వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ఉంటాము. అయితే మీ వాట్సాప్ ని సురక్షితంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మరి అందుకోసమే ఈ ఫీచర్స్ ని ఉపయోగించండి.
6 నెంబర్ల పిన్:
మీ వాట్సాప్ లో 6 అంకెల పిన్ ని సెట్ చేసి ఉంచండి. ఇలా ఉండడం వల్ల వాట్సాప్ సురక్షితంగా ఉంటుంది. పైగా మీ మొబైల్ నెంబర్ నుండి ఎవరు కూడా వాట్సాప్ కి లాగ్ ఇన్ అవ్వలేరు. ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేసిన ఆరు అంకెల పిన్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
డిసెప్పీయరింగ్ మెసేజెస్:
వాట్సాప్ లో డిసెప్పీయరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ ఉంది. ఎక్కువ ఎక్కువ మెసేజెస్ వస్తూ ఉంటాయి అప్పుడు మీరు ఈ ఫీచర్ ని ఎనేబుల్ చేస్తే పాత మెసేజ్లు అన్నీ కూడా వాటంతటవే డిలీట్ అయిపోతాయి.
యాప్ లాక్:
మీ వాట్సాప్ లాక్ అయ్యే విధంగా మీరు సెట్టింగ్స్ చేయండి. దీనికోసం మీరు బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ను ఉపయోగించాలి. థర్డ్ పార్టీ ఆప్ ఉపయోగించాల్సిన పని లేదు. ఇలా మీరు యాప్ ని లాక్ చేయవచ్చు.
అడ్మిన్ కంట్రోల్స్:
మీరు ఏదైనా గ్రూప్ ని క్రియేట్ చేసి అడ్మిన్ గా ఉన్నారా అయితే అప్పుడు అడ్మిన్ గా మీకు ఉన్న అధికారాలను ఉపయోగించుకోవచ్చు.
బ్లాక్:
ఎవరైనా సరే ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి మీరు వాట్సాప్ లో బ్లాక్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి రిపోర్ట్ చేస్తే వాట్సాప్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. ఇలా ఈ ఫీచర్స్ ని ఉపయోగించి మీరు మీ వాట్సాప్ అకౌంట్ ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.