ఎంతో రుచికరమైన బ్రౌన్ రైస్ లడ్డూలని చేసేయండిలా..!

-

బ్రౌన్ రైస్ తో మనం ఇంట్లోనే ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. కేవలం కారంగా మాత్రమే కాకుండా స్వీట్లు కూడా మనం తయారు చేసుకోవచ్చు. నిజంగా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది పైగా ఎంతో రుచికరంగా ఉంటాయి.

brown-rice-laddu
brown-rice-laddu

ప్రిపరేషన్ సమయం: 20 నిమిషాలు
కుకింగ్ సమయం: 20 నిమిషాలు
సర్వింగ్స్: 8

బ్రౌన్ రైస్ లడ్డు కి కావలసిన పదార్ధాలు:

500 గ్రాములు బ్రౌన్ రైస్
కొబ్బరి తురుము
500 గ్రాములు బెల్లం
50 మిల్లీలీటర్లు నెయ్యి
1 స్పూన్ యాలుకల పొడి
అర కప్పు జీడిపప్పు

తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా బియ్యాన్ని తీసుకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక గుడ్డమీద పోసి ఆరబెట్టాలి. రెండు గంటలపాటు ఆరబెట్టడం మర్చిపోకండి. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే లడ్డూలు తయారు చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి బియ్యం వేసి కాస్త రంగు మారేవరకు వేయించుకోండి. ఇవి చల్లారిన తరువాత మిక్సీలో వేసి పిండిలా పట్టుకోండి. జల్లెడ తీసుకొని ఈ పిండిని బాగా జల్లించండి.
ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక కప్పు నీళ్లలో బెల్లం వేసి మరిగించండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని కొబ్బరి తురుములో వేసి అందులో జీడిపప్పు, నెయ్యి, బియ్యం పిండి, యాలుకల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఉండలు అయ్యేవరకు కూడా బాగా కలిపి ఉండలు మాదిరి చేసుకోండి.
అంతే ఈ లడ్డూలను ఎయిర్టెల్ కంటైనర్ లో పెడితే ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news